శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 26 డిశెంబరు 2019 (19:11 IST)

విశ్వ‌క్‌ సేన్ `హిట్‌` మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

హీరోగా ప‌లు వైవిధ్య‌మైన చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సాధించి త‌నకంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు నేచుర‌ల్ స్టార్ నాని. కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేసే క్ర‌మంలో భాగంగా వాల్‌పోస్ట‌ర్ సినిమా అనే బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి తొలి ప్ర‌య‌త్నంలోనే `అ!` వంటి డిఫ‌రెంట్ మూవీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించి నిర్మాత‌గా స‌క్సెస్‌ను సాధించారు. 
 
ఇప్పుడు నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్‌పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై `ఫ‌ల‌క్‌నుమా దాస్` ఫేమ్‌ విశ్వ‌క్‌సేన్ హీరోగా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపురనేని నిర్మిస్తోన్న చిత్రం `హిట్‌`. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. 
 
ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విశ్వ‌క్‌సేన్ హీరోగా సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్‌లో విశ్వ‌క్‌సేన్ స్టైలిష్‌గా క‌న‌ప‌డుతున్నారు. సూప‌రిండెంట్ ఆఫ్ పోలీస్ విక్ర‌మ్ రుద్ర‌రాజు అనే ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో విశ్వ‌క్‌సేన్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నున్నారు. కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 1న `హిట్` సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను విడుద‌ల చేస్తున్నారు. మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు.