సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 డిశెంబరు 2019 (15:24 IST)

రాజమౌళికి షాక్ : కొమరం భీం లుక్‌ను రివీల్ చేసిన నెటిజన్లు

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌లు హీరోలు కాగా, ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. వచ్చే యేడాది జూలై 30వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం వైజాగ్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో జ‌రుగుతుంది. ఎన్టీఆర్‌పై కీల‌క సన్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. అయితే సినిమాకి సంబంధించి ఎలాంటి ఫోటోలు, వీడియోలు బ‌య‌ట‌కిరాకుండా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్న రాజ‌మౌళికి షాక్ ఇచ్చారు నెటిజ‌న్స్. 
 
'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ఎన్టీఆర్ లుక్ విడుద‌ల చేయ‌మ‌ని అభిమానులు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళిని కోరుతూ వ‌స్తున్నారు. కాని జ‌క్క‌న్న పెండింగ్‌లో పెడుతూ ఉండ‌గా, తాజాగా కొమురంభీం పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ లుక్‌ని రివీల్ చేసి షాక్ ఇచ్చారు నెటిజ‌న్స్. భారీ గెడ్డం, త‌ల‌కి పాగా, న‌ల్ల‌టి దుస్తులు ధ‌రించిన ఎన్టీఆర్ ఊరిని ఉద్దేశించి ఏదో మాట్లాడుతున్న‌ట్టు అర్థమ‌వుతుంది.
 
డీవీవీ దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా, ఈ సినిమాలో భారీ తారాగ‌ణం న‌టిస్తుంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న ఒలివీయా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. చర‌ణ్‌తో అలియా జోడీ క‌డుతుంది. అజ‌య్ దేవ‌గ‌ణ్‌, సముద్ర‌ఖ‌ని ప‌లువురు స్టార్స్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. కీర‌వాణి సంగీత‌మందిస్తున్నారు.