తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారం చేసుకుని తెరకెక్కుతున్న తలైవి ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్‌లో జయలలితగా నటిస్తున్న కంగనా రనౌత్ అచ్చుగుద్దినట్లు జయలలితను తీసిపెట్టేశారు. కంగనా కటౌట్ అచ్చుగుద్దినట్లు అమ్మ జయలలితలా వుందంటూ తమిళ ప్రజలు అంటున్నారంటే కంగనా ఆ పాత్రలో ఎంత ఒదిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాత విష్ణు ఇందూరి రూపొందిస్తుండగా, ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం...