ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 28 అక్టోబరు 2019 (11:21 IST)

వెంకీమామ పోస్ట‌ర్ అదిరింది, ఇంత‌కీ రిలీజ్ ఎప్పుడు..?

విక్ట‌రీ వెంకటేష్ – యువ స‌మ్రాట్ నాగ చైతన్యల క్రేజీ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం వెంకీమామ‌. జైల‌వ‌కుశ ఫేమ్ బాబీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన‌ప్పుడు ఇది ఫ్యామిలీ మూవీ అనుకున్నారు కానీ... లోగో రిలీజ్ చేసిన త‌ర్వాత ఇది కేవ‌లం ఫ్యామిలీ మూవీ మాత్రేమే కాదు ఇందులో క‌థ చాలా ఉంది అనే ఫీలింగ్ అంద‌రికీ క‌లిగింది.
 
దీపావ‌ళి సంద‌ర్భంగా వెంకీమామ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసారు. అల్లుడు ఆర్మీ డ్రెస్‌లో రఫ్‌గా కనిపిస్తుంటే వెంకీ మామ మాస్ లుక్‌తో దర్శనమిచ్చాడు. దీపావళి సందర్బంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర దగ్గుబాటి – అక్కినేని అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. గతంలో ఎప్పుడు లేని విధంగా వెంకటేష్ – నాగ చైతన్య సరికొత్త థ్రిల్ ఇవ్వనున్నట్లు అర్ధమవుతోంది. 
 
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ డ్రామాను సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
 వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. నాగ చైతన్యకు జోడిగా రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. దీపావ‌ళి సంద‌ర్భంగా పోస్ట‌ర్ రిలీజ్ చేసారు కానీ... రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం చెప్ప‌లేదు. ఎప్పుడు చెబుతారో ఏంటో..?