మార్చి ఒకటో తేదీ నుంచి సినిమా హాళ్లకు సెలవులు
సాధారణంగా మార్చి - ఏప్రిల్ నెలల్లో విద్యార్థులకు సెలవులు ఇస్తారు. కానీ, వచ్చే యేడాది నుంచి సినిమా థియేటర్లకు కూడా సెలవులు ఇవ్వనున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి ఈ సెలవులు రానున్నాయి.
సాధారణంగా మార్చి - ఏప్రిల్ నెలల్లో విద్యార్థులకు సెలవులు ఇస్తారు. కానీ, వచ్చే యేడాది నుంచి సినిమా థియేటర్లకు కూడా సెలవులు ఇవ్వనున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి ఈ సెలవులు రానున్నాయి. థియేటర్లకు సెలవులు ఏంటనే కదా మీ సందేహం.. అయితే, ఈ కథనం చదవండి.
మార్చి ఒకటో తేదీ నుంచి సినిమాలను విడుదల చేయవద్దని తెలుగు చలన చిత్ర మండలి నిర్ణయం తీసుకుంజలది. థియేటర్లలో సినిమాను ప్రదర్శించడానికి యు.ఎఫ్.వో, క్యూబ్ వంటి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు అత్యధిక ధరలను నిర్ణయించడంతో నిర్మాతలు, పంపిణీదారులు భారీగా నష్టాలను చవిచూడాల్సి వస్తోంది.
దీంతో ధరలు తగ్గించాలని పదేపదే కోరినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదు. పైగా, చర్చలకు ఆహ్వానించినప్పటికీ ఆ సంస్థల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో మార్చిలో సినిమాల విడుదలను నిలిపివేస్తున్నట్టు తెలుగు చలన చిత్ర మండలి కార్యదర్శి ముత్యాల రామదాసు వెల్లడించారు. దీంతో మార్చి ఒకటో తేదీ నుంచి థియేటర్లు కూడా మూతపడనున్నాయి.