ఒక్క దెబ్బతో 15 సెలవులు రద్దు.. దటీజ్ సీఎం యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకే ఒక నిర్ణయంతో ఏకంగా 15 సెలవులను రద్దు చేశారు. ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌కు గురి చేసింది. నిజానికి యూపీలో ఏకంగా 4
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకే ఒక నిర్ణయంతో ఏకంగా 15 సెలవులను రద్దు చేశారు. ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌కు గురి చేసింది. నిజానికి యూపీలో ఏకంగా 42 పబ్లిక్ హాలిడేలు ఉండేవి. వాటి మీద ఒక్కసారిగా కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వేటు వేశారు. ఒకేసారి మొత్తం 15 సెలవులు రద్దుచేశారు. ఈ మేరకు యోగి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ప్రముఖుల జయంతులు, వర్ధంతుల సందర్భంగా ఇస్తున్న సెలవుల్లో చాలావరకు రద్దు చేస్తూ నిర్ణయించారు. ఈ రోజులన్నీ ఇన్ని సెలవులు ఉంటే ప్రభుత్వ కార్యాలయాలు ఇక పనిచేసేది ఎప్పుడని సీఎం యోగి మండిపడ్డారు. రోజుకు 18-20 గంటలు పనిచేయగలిగితేనే తనతో ఉండాలని, లేకపోతే ఎవరి దారి వాళ్లు చూసుకోవచ్చని ముందే చెప్పిన యోగి.. ఇప్పుడు సెలవులను కూడా తగ్గించడం గమనార్హం.