గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By venu
Last Modified: బుధవారం, 14 జూన్ 2017 (13:31 IST)

సన్నీ లియోన్ బాటలో మిస్ ఆంధ్రా... ఇటు కాదు అటు... ఎటూ...?!!

సికింద్రాబాద్‌లో చదువుకుని, 19 ఏళ్లకే మిస్ ఆంధ్రాగా ఎన్నికై, మోడలింగ్ రంగం నుండి టాలీవుడ్ మీదుగా బాలీవుడ్ వరకు పాకిన ఓ తెలుగు (?) తార ఇప్పుడు అవకాశాల్లేక పోర్న్ సినిమాలకూ పచ్చజెండా ఊపేస్తానంటోంది. పేరు మార్చుకున్నా ఫలితం దక్కకపోవడంతో ఫీల్డ్ మార్చుకుం

సికింద్రాబాద్‌లో చదువుకుని, 19 ఏళ్లకే మిస్ ఆంధ్రాగా ఎన్నికై, మోడలింగ్ రంగం నుండి టాలీవుడ్ మీదుగా బాలీవుడ్ వరకు పాకిన ఓ తెలుగు (?) తార ఇప్పుడు అవకాశాల్లేక పోర్న్ సినిమాలకూ పచ్చజెండా ఊపేస్తానంటోంది. పేరు మార్చుకున్నా ఫలితం దక్కకపోవడంతో ఫీల్డ్ మార్చుకుంటోంది. ఆవిడ మరెవరో కాదు - మోనాచోప్రా నుండి షెర్లీన్ చోప్రాగా మారిన హైదరాబాదీ.
 
ఇదివరకే కామసూత్ర 3డి చిత్రంలోనూ, ప్లేబాయ్ మ్యాగజైన్ కోసం హీటెక్కించే ఫోజులతోనూ కుర్రకారు మతిపోగొట్టిన ఈ సుందరి ఆ అనుభవాన్ని రంగరించి నేరుగా శృంగార చిత్రాల్లోనే నటించేందుకు సిద్ధపడుతోంది. ఇప్పటికే నగ్నంగా ఫోజులిచ్చేందుకు, కామసూత్ర సినిమాలో శృతిమించి మరీ సన్నివేశాలనూ పండించిన షెర్లీన్ పూర్తిస్థాయి పోర్న్ నటిగా మారే క్రమంలో విదేశాల్లో సెటిలయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
 
ఒకప్పుడు ఐశ్వర్యరాయ్ నుండి నేటి ప్రియాంకా, దీపిక వంటి బాలీవుడ్ తారలు హాలీవుడ్‌ బాటపట్టి ఓ రేంజిలో అందాలను ఆరబోస్తున్నారు.. మరోవైపు సన్నీలియోన్ వంటి ప్రముఖ పోర్న్ తార బాలీవుడ్‌లో మత్తెక్కించే పాటలకు చిందులేస్తోంది.. ఇప్పుడు తాజాగా షెర్లీన్ సన్నీ వచ్చిన దారిలో రివర్స్‌లో ప్రయాణిస్తానంటోంది.. చూద్దాం.. అవకాశాల్లేని భామలకు బాలీవుడ్‌లో కొదవ ఏమీ లేదుగా.. మరెంతమంది పోర్న్ బాట పట్టనున్నారో...