సోమవారం, 24 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 9 జూన్ 2016 (13:11 IST)

ఉడ్తా పంజాబ్‌పై నో కామెంట్స్ అన్న ఏక్తా కపూర్.. సూపర్ ఫిలిమ్ అన్న శ్యామ్!!

పంజాబ్‌లో డ్రగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఉడ్తా పంజాబ్ సినిమాపై సెన్సార్‌బోర్డు, బాలీవుడ్‌కు మధ్య వార్ జరుగుతోన్న నేపథ్యంలో.. ఉడ్తా పంజాబ్‌ను ప్రత్యేక షో ద్వారా శ్యామ్ బెనెగల్ నేతృత్వంలోని కమిటీ వీ

పంజాబ్‌లో డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఉడ్తా పంజాబ్ సినిమాపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఉడ్తా పంజాబ్ టైటిల్ మార్పుతో పాటు సినిమాలో పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన 89 సీన్లను కట్ చేయాలని సెన్సార్ బోర్డు నిర్ణయించడంపై బాలీవుడ్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. 
 
ఈ నేపథ్యంలో.. దర్శకురాలు ఏక్తాకపూర్ మాట్లాడుతూ తాను, అనురాగ్ కశ్యప్ సినిమా వివాదం గురించి చర్చించాం. ఉడ్తా సినిమాపై అనవసరంగా కామెంట్లపై తాను స్పందించదలచుకోవట్లేదన్నారు. మరోవైపు సాంకేతికత పరంగా ఉడ్తా పంజాబ్ సినిమాను బాగా తీశారని ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగెల్ ప్రశంసలు గుప్పించారు. 
 
పంజాబ్‌లో డ్రగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఉడ్తా పంజాబ్ సినిమాపై సెన్సార్‌బోర్డు, బాలీవుడ్‌కు మధ్య వార్ జరుగుతోన్న నేపథ్యంలో..  ఉడ్తా పంజాబ్‌ను ప్రత్యేక షో ద్వారా శ్యామ్ బెనెగల్ నేతృత్వంలోని కమిటీ వీక్షించింది. అనంతరం శ్యామ్ బెనెగల్ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఉడ్తా పంజాబ్ సినిమాను సాంకేతికంగా చాలా బాగా తీశారని తెలిపారు.