ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 8 జూన్ 2023 (16:56 IST)

భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కర్ణ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

karna movie
karna movie
రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలు ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ సాధిస్తున్నాయి. ఇప్పుడు అదే బాటలో యదార్థ సంఘటనల ఆధారంగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కర్ణ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సనాతన క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై కళాధర్ కొక్కొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే స్వీయ నిర్మాణంలో హీరో గా నటిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్, టీజర్ ప్రేక్షకుల మెప్పు పొంది సినిమా పట్ల ఆసక్తి పెంచేసింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. 
 
మోనా ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు, అజయ్, ఎజాస్, ప్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రశాంత్ BJ సమకూరుస్తుండగా శ్రవణ్ G కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 
 
జూన్ 23వ తేదీన ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి 'గుడి యనక నా సామీ' పాటను విడుదల చేయగా ప్రేక్షకాదరణ పొందింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటను విడుదల చేయడం విశేషం. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ కర్ణ మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు మేకర్స్. 
 
నటీనటులు: కళాధర్ కొక్కొండ, మోనా ఠాకూర్, ఆస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు, అజయ్, ఎజాస్, ప్రియ