శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 4 జులై 2019 (14:56 IST)

షాక్ అయిన స‌మంత‌... ఇంత‌కీ ఏమైంది..?

స‌మంత అక్కినేని న‌టించిన లేటెస్ట్ మూవీ ఓ..బేబి. నందినీ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి, రాజేంద్ర‌ప్ర‌సాద్, రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌లు పోషించారు. కొరియ‌న్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్ ఇది.

రోటీన్‌కి భిన్నంగా వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాపై ప్రారంభం నుంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే... ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. టీమ్ కాన్ఫిడెన్స్‌తో పాటు ఆల్రెడీ సినిమా చూసిన వ‌క్త‌ల మాట‌ల‌తో బేబిపై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయ‌ని చెప్ప‌చ్చు. 
 
ఇంత‌కీ విష‌యం ఏంటంటే... నెల 5న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది ఓ బేబీ. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ దేవి థియేటర్లో సమంత నిలువెత్తు కటౌట్‌ను ఏర్పాటు చేశారు. స్టార్ హీరోల‌కు ఈ రేంజ్‌లో క‌టౌట్‌లు ఏర్పాటు చేస్తుంటారు.

స‌మంత‌కి ఇలా భారీ క‌టౌట్ పెట్టారంటే ఆమెకు ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. స‌మంత క‌టౌట్ స్టిల్ సోషల్ మీడియాలో సమంత, అక్కినేని అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో త‌న క‌టౌట్ గురించి తెలుసుకున్న స‌మంత‌... ఈ క‌టౌట్ చూసి షాక్ అయ్యాన‌ని చెప్పింది. అదీ..మ్యాటరు.