శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 30 జూన్ 2019 (18:08 IST)

'ఓ బేబీ' వేడుకలో అందాలు ఆరబోసిన శ్రీమతి సమంత (ఫోటోలు)

అక్కినేని ఇంటి కోడలు సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఓ బేబీ'. ఈ చిత్రం జూలై 5వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం ప్రిరిలీజ్ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో సమంత మాట్లాడుతూ, 'కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రం తీయడం ఈ రోజుల్లో చాలా కష్టం. నన్ను నమ్మి ఈ సినిమాని తీసిన నిర్మాతలకు కృతజ్ఞతలు. నా సినీ జీవితంలోనే అత్యుత్తమ పాత్ర ఇచ్చారు. ఈ కథని మేం ఎంచుకోలేదు. ఈ కథే మమ్మల్ని ఎంచుకుందన్నారు.
 
నందిని నాకు ఓ అక్కలా మారిపోయింది. వందశాతం తనని నమ్మాను. ఆ నమ్మకం నా నటనలో కనిపిస్తుంది. ఓ పోస్టర్‌ చూడగానే సినిమాలో నిజాయతీ ఉందా, లేదా? అనేది ప్రేక్షకులకు అర్థమైపోతుంది. ప్రతి ప్రచార చిత్రం ఈ సినిమాపై నమ్మకం తీసుకొచ్చి ఉంటుంది. ఈ సినిమాకి రండి. మీరు ఏమాత్రం నిరుత్సాహపడరు' అని చెప్పుకొచ్చింది. కార్యక్రమంలో నాగశౌర్య, వివేక్‌ కూచిభొట్ల, సునీత, బీవీఎస్‌ రవి, అబ్బూరి రవి, నాగ అశ్విన్‌, ప్రగతి, తేజ తదితరులు పాల్గొన్నారు.
 
అలాగే, సీనియర్ హీరో వెంకటేష్ మాట్లాడుతూ, 'ఈ సినిమా చూశాను. నందిని ఈ సినిమాని బాగా తీర్చిదిద్దింది. కొత్త తరహా కథ ఇది. నటీనటులంతా చాలా బాగా చేశారు. బేబీగా సమంత అదరగొట్టింది. సినిమా మామూలుగా లేదు. సమంత సినీ జీవితంలోనే ఇది అత్యుత్తమ చిత్రం అనుకోవచ్చు. హావభావాలన్నీ చక్కగా పలికించిందని చెప్పుకొచ్చారు. మరో హీరో రానా మాట్లాడుతూ 'ఈ సినిమాలో పని చేసిన చాలా మందితో నాకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉంది. కొత్త సినిమాలు తెలుగులో రావాలని ఎప్పుడూ అనుకునేవాడ్ని.  ఇలాంటి చిత్రాలు ప్రతి వారం, ప్రతిరోజూ రావాలి. ఇలాంటి సినిమాలతో సురేష్‌ ప్రొడక్షన్స్‌లో కొత్త శకం  ప్రారంభమైందని చెప్పుకొచ్చారు.
 
ఇక దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ, 'ఈ సినిమా నేను చూశాను. నందిని నా ఏకలవ్య శిష్యురాలు. క్లిష్టమైన సన్నివేశాల్ని కూడా చాలా బాగా తెరకెక్కించింది. రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌, లక్ష్మి పోటీపడి నటించారు. అందం, అభినయం ఉంటే.. కథానాయికలు  అయిపోరు. మంచి పాత్రలు దక్కాలి. సమంత అలా  వరుసగా మంచి మంచి పాత్రలతో దూసుకుపోతోంది. తనతో నేను సినిమా చేయలేదు. నా రాబోయే చిత్రంలో కనీసం అతిథి పాత్రలో అయినా తను నటిస్తుందని ఆశిస్తున్నా అని రాఘవేంద్రరావు అన్నారు.