శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్
Last Updated : గురువారం, 20 జూన్ 2019 (17:49 IST)

సమంతకి మంచి పేరు వస్తుంది.. ఓ బేబీగా అదరగొట్టింది... దర్శకేంద్రుడు

అక్కినేని వారి ఇంట అడుగుపెట్టిన త‌ర్వాత కాస్తంత విభిన్న‌మైన పాత్ర‌లతోనే ప్రేక్షకుల ముందుకి వ‌స్తున్న స‌మంత... ఆ సినిమాల‌న్నీ విజ‌య‌వంతం అవుతూండడంతో మరింతగా దూసుకుపోతోంది.


కాగా ఈ సినిమాలన్నీ కూడా ఆవిడకి న‌టిగా మంచి పేరు సంపాదించి పెడ్తూండడం విశేషం. తాజాగా స‌మంత న‌టించిన చిత్రం `ఓ బేబీ`. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది.
 
ఈ టీజ‌ర్‌పై టాలీవుడ్‌లో తెర వెనుక తప్ప తెరపై పెద్దగా కనబడని ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ... "ఓ బేబీ` సినిమా చూసాను. సినిమా చాలా కొత్తగా ఎమోషనల్‌గా ఉంది.


స‌మంత‌ 70 ఏళ్ళ బామ్మగా చేసింది అనడం కంటే 70 ఏళ్ళ అనుభవం ఉన్న నటిగా చేసింది. ఈ సినిమా స‌మంత‌కి ఇంకా పెద్ద పేరు తీసుకొస్తుంది" అంటూ ట్వీట్ చేసారు.