గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (15:18 IST)

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ఇకలేరు..

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ఇకలేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఆయన గురువారం తీవ్ర అస్వస్థతకు గురైన.. శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 
 
గతంలో పక్షవాతం బారినపడిన ఆయన త్వరగానే కోలుకున్నారు. కానీ, ఈ దఫా మాత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు లోనై ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. వంద చిత్రాలకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ.. హీరో బాలకృష్ణతో అనేక చిత్రాలు తీశారు. 
 
ముద్దుల కృష్ణయ్య, ముద్దులు మావయ్య, మువ్వా గోపాలు వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. పైగా, ఈయన నిర్మించిన పెక్కు చిత్రాలను ప్రముఖ నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి తన సొంత నిర్మాణ సంస్థ భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్‌పై నిర్మించారు.