శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 19 ఏప్రియల్ 2017 (22:34 IST)

గుండు కొట్టించుకున్నా... రూ.10 లక్షలు తీసుకుని రా... ముస్లిం పెద్దకు సోనూ నిగమ్ సవాల్...

ప్రముఖ గాయకుడు సోనీ నిగమ్ తనకు గుండు కొట్టించినవారికి రూ.10 లక్షలు ఇస్తానంటూ ఫత్వా జారీ చేసిన ముస్లిం పెద్ద ఖ్వాద్రిపై మండిపడ్డారు. ఎవరో గుండు కొట్టించడం ఎందుకు... నేనే కొట్టించుకున్నా గుండు, రూ. 10 లక్షలు ఎక్కడ అంటూ ప్రశ్నించారు. కాగా సోనూ నిగమ్‌ తల

ప్రముఖ గాయకుడు సోనీ నిగమ్ తనకు గుండు కొట్టించినవారికి రూ.10 లక్షలు ఇస్తానంటూ ఫత్వా జారీ చేసిన ముస్లిం పెద్ద ఖ్వాద్రిపై మండిపడ్డారు. ఎవరో గుండు కొట్టించడం ఎందుకు... నేనే కొట్టించుకున్నా గుండు, రూ. 10 లక్షలు ఎక్కడ అంటూ ప్రశ్నించారు. కాగా సోనూ నిగమ్‌ తల గొరిగి గుండు చేసి అతడి మెడలో పాత చెప్పుల దండ వేసి ఆ తర్వాత అతడిని దేశమంతా తిప్పిన వారికి వ్యక్తిగతంగా తాను 10 లక్షల రూపాయలు ఇస్తానని పశ్చిమ బెంగాల్‌ మైనారిటీ యునైటెడ్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు సయిద్‌ షా అతిఫ్‌ అలీ ఆల్‌ ఖ్వాద్రి ప్రకటించారు. 
 
దీనిపై సోనూ నిగమ్ మండిపడుతూ ట్వీట్ల వర్షం కురిపించారు. తనను ముస్లిం వ్యతిరేకి అనడానికి ఆయనకు నోరెలా వచ్చిందో తనకు అర్థం కావడంలేదన్నారు. మీడియా ముందుకు వచ్చిన ఆయన, మహ్మద్ రఫీని తను తండ్రిలా భావిస్తాననీ, ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ సాహెబ్ ను గురువులా పూజిస్తానంటూ చెప్పారు.