గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 7 సెప్టెంబరు 2024 (17:43 IST)

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

renu desai
భారతీయుడు అపజయం పాలవడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని సీనియర్ నటి రేణూ దేశాయ్ సామాజిక మాధ్యమంలో పెట్టిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండియన్ 2 చిత్రంలో హీరో కమల్ హాసన్ వీధి కుక్కలపై చేసిన వ్యాఖ్యలపై జంతు ప్రేమికుల్లో విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేసారు. మూగ జీవాలపై ఇలాంటి డైలాగ్స్ రాయడానికి రచయితలకు ఎలా మనసు వస్తుందో అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.

ఇండియన్ 2 చిత్రంలో వీధి కుక్కలను హీరో కమల్ హాసన్ కించపరిచే డైలాగులున్నాయి. వీటిని ఉటంకిస్తూ రేణూ దేశాయ్ సోషల్ మీడియా పేజీలో పోస్ట్ పెట్టారు. అందులో ఆమె... నిజంగా ఇలాంటి సినిమాలు ఫ్లాప్ అయినందుకు నిజంగా నాకు ఎంతో సంతోషమేస్తుంది. ఈ ఇడియట్ రైటర్స్ ఇలాంటి డైలాగులు ఎలా రాస్తారో అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలా రాసేవారి మతి స్థిమితం సరిగా వున్నట్లేనా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.