శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 29 డిశెంబరు 2017 (15:40 IST)

బాలక్రిష్ణను తండ్రిగా భావిస్తా... నయనతార సంచలన వ్యాఖ్యలు

బాలక్రిష్ణ.. నయనతార హిట్ పెయిర్‌గా చెప్పుకుంటుంటారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సింహా సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో వీరి జంటను చూసిన తెలుగు ప్రేక్షకులు హిట్ పెయిర్‌గా చెబుతూ వచ్చారు. అలాంటి జంట ఇప్పుడు జై సింహా పేరుతో మరో సినిమా

బాలక్రిష్ణ.. నయనతార హిట్ పెయిర్‌గా చెప్పుకుంటుంటారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సింహా సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో వీరి జంటను చూసిన తెలుగు ప్రేక్షకులు హిట్ పెయిర్‌గా చెబుతూ వచ్చారు. అలాంటి జంట ఇప్పుడు జై సింహా పేరుతో మరో సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయి జనవరి 12వ తేదీన విడుదల కానుంది. సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్న సంధర్భంగా నయనతార ఒక టివి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
బాలక్రిష్ణను నా తండ్రిలాగా భావిస్తాను. ఆయన్ను చూస్తే రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టాలనిపిస్తుంది. ఆయన అంటే ఎంతో గౌరవం నాకు. బాలక్రిష్ణతో కలిసి నటించడమంటే నాకు చాలా ఇష్టం. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో మరో అవకాశం నాకు బాలక్రిష్ణతో నటించేందుకు వచ్చింది. షూటింగ్ పూర్తి చేసుకున్నాం. సినిమా భారీ హిట్టవుతుందన్న  నమ్మకం నాకుంది. బాలక్రిష్ణను ఎప్పుడు చూసినా నా కుటుంబ సభ్యుడిలా ఫీలవుతానంటోంది నయనతార. నయనతార చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.