శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 17 డిశెంబరు 2017 (17:23 IST)

కేసులో ఇరుక్కున్న మెర్సల్ హీరో తండ్రి.. తిరుపతి హుండీ కానుకలన్నీ లంచాలే..

తిరుపతి దేవస్థానంలో భక్తులు సమర్పించే కానుకలు ఆ దేవునికి లంచం ఇచ్చినట్టేనని నటుడు విజమ్‌ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రశేఖర్ కోర్టు కేసులో చిక్కుకున్నారు. గత నవంబరు న

తిరుపతి దేవస్థానంలో భక్తులు సమర్పించే కానుకలు ఆ దేవునికి లంచం ఇచ్చినట్టేనని నటుడు విజమ్‌ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రశేఖర్ కోర్టు కేసులో చిక్కుకున్నారు. గత నవంబరు నెలలో చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రశేఖర్ చేసిన వీడియో బయటకు రావడంతో వివాదంలో చిక్కుకున్నారు. 
 
ఆలయ హుండీల్లో కానుకలు వేస్తే పరిక్షల్లో ఉత్తీర్ణత కోసం ఇక పరిక్షలే రాయవలసిన అవసరం లేదని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై హిందు మున్నని సంఘం మండిపడింది. చంద్రశేఖర్‌ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను గాయపరచేవిగా వున్నాయని చెన్నై పోలీస్‌ కమీషనర్‌ కార్యాలయంలో హిందు మున్నని సంఘం గత నెల 25వ తేదీన ఫిర్యాదు చేశారు. 
 
అయితే ఆ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటీషన్‌లో దర్శకుడు ఎస్‌ఏ. చంద్రశేఖర్‌పై తగిన చర్యలు తీసుకునేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ కేసు శనివారం న్యాయమూర్తి ఎంఎస్‌.రమేశ్‌ సమక్షంలో విచారణకు రాగా తగిన ఆధారాలుంటే దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు.