శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 10 జులై 2017 (08:21 IST)

ఛాన్సుల కోసం స్నేహం నటించి, క్లోజ్‌గా మూవ్‌ కావడం నావల్లకాదన్న జఘన సుందరి

‘‘ఛాన్సుల కోసం లేనిపోని స్నేహం నటించి, క్లోజ్‌గా మూవ్‌ కావడం నాకిష్టం లేదు. ఫలానా హీరోతో క్లోజ్‌గా ఉంటే ఛాన్స్‌ వస్తుందని, హీరోలతో పార్టీలకు వెళితే రికమండ్‌ చేస్తారని ఆలోచించను. నా టాలెంట్‌ మీద నమ్మకం

‘‘ఛాన్సుల కోసం లేనిపోని స్నేహం నటించి, క్లోజ్‌గా మూవ్‌ కావడం నాకిష్టం లేదు. ఫలానా హీరోతో క్లోజ్‌గా ఉంటే ఛాన్స్‌ వస్తుందని, హీరోలతో పార్టీలకు వెళితే రికమండ్‌ చేస్తారని ఆలోచించను. నా టాలెంట్‌ మీద నమ్మకం ఉంది. ఎవరైనా దాన్ని గుర్తించి ఛాన్స్‌ ఇస్తే ఓకే. లేకపోతే ఫర్వాలేదు. వేరేవాళ్ల సంగతి నాకు తెలీదు. నేనింతే’’ అంటూ తేల్చి చెప్పారు ఇలియానా. 
 
సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్‌ పట్టాలన్నా, ఇంకో ఛాన్స్‌ వెతుక్కుంటూ తలుపు తట్టాలన్నా హీరోయిన్లకు మంచి పరిచయాలు తప్పనిసరి అనేది ఫిల్మ్‌నగర్‌ పబ్లిక్‌ సీక్రెట్‌. నలుగురిలో కలుపుగోలుగా ఉంటేనే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నెగ్గుకు రాగలరని అంటుంటారు. అందుకే ఇండస్ట్రీలో జరిగే పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది కొందరి అభిప్రాయం. 
 
కానీ ‘‘నేను ఆ టైప్‌ కాదు’’ అని ఇలియానా సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు. ఇండస్ట్రీలో జరిగే పార్టీలకు హాజరవుతాను కానీ వాటి సాకుతో పరిచయాలు పెంచుకుని ఛాన్సులు కొట్టడ్ నాకు చేతకాదన్నారామె. అంతెందుకు సర్జరీ చేయించుకుంటే వదనం ఇంకా బాగుంటుందని ఒక డాక్టర్ సలహా ఇస్తే దాన్ని తోసి రాజని నా పాటికి నేను ఉంటున్నానని కూడా చెప్పారు.
 
‘‘హిందీలో ‘బర్ఫీ’ చేశాక, ఓ డాక్టర్‌ని కలిశా. అతను ‘మీ ముఖంపై లాఫింగ్‌ లైన్స్‌ ఉన్నాయి. వాటిని పోగొట్టేందుకు సర్జరీ చేయించుకుంటే బాగుంటుంది’ అని సలహా ఇచ్చాడు. ఆపరేషన్‌ చేయించుకుని, అందం పెంచుకోవాల్సిన అవసరం లేదనుకున్నా. అందుకే ఒప్పుకోలేదు’’ అన్నారు ఇలియానా.. వస్త్ర ధారణ విషయంలో బోల్డ్ బోల్డెస్టుగా ఉండే ఈ జఘన సుందరి నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు చెప్పడంలో కూడా బోల్డ్ గర్లేమరి.
 
దీనికి ఒక ఉదాహరణ. పెళ్లి కాకముందే డేటింగ్ పేరుతో సంబంధాల్లోకి వెళ్లిపోయే కాలంలో ఆ అనుభవం గురించి ఏ నటి కూడా చెప్పుకోలేని సాహస ప్రకటన చేశారీమె. ఒక శారీరక సంబంధంలోకి వెళ్లిన క్షణాలు తనువూ, మనసూ పరవశమయ్యే క్షణాలు. వాటిని అతి మధురంగా ఆస్వాదించేశానన్నారు.
 
ఇంత మాటన్న తర్వాత ఇలియానాను ఇక ఎవరు ఆపగలరు?