శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2023 (08:54 IST)

ఖుషి షూటింగ్ టైమ్ లో లవ్ లో పడిపోయాను : సమంత

vijay, Samantha dance
vijay, Samantha dance
విజయ్ దేవరకొండ, సమంత చూడగానే తనను తాను మర్చిపోయాడు. స్టేజి మీదకు రాగానే షర్ట్ తీసి బనియన్తో ఉన్న విజయ్ ను చూడగానే ఎంతో తన్మయంతో సమంత హగ్ చేసుకుంది. ఇద్దరూ పాటలకు అనుగుణంగా డాన్స్ వేశారు. 
 
vijay, Samantha dance
vijay, Samantha dance
విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమా మ్యూజిక్ కన్సర్ట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ఆద్యంతం మ్యూజిక్ లవర్స్ ను మెస్మరైజ్  చేసింది. ఈ మ్యూజిక్ కన్సర్ట్ లో ‘ఖుషి’ సినిమాలోని బ్యూటిపుల్ సాంగ్స్ ను సింగర్స్ జావెద్ అలీ, సిధ్ శ్రీరామ్, మంజూష, చిన్మయి, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ పాడి ఆకట్టుకున్నారు. ‘ఖుషి’ టైటిల్ సాంగ్ లో విజయ్ దేవరకొండ, సమంత లైవ్ పర్ ఫార్మెన్స్ కు ఆడియెన్స్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఖుషి’ పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 1న రిలీజ్ కు రెడీ అవుతోంది. 
 
హీరోయిన్ సమంత మాట్లాడుతూ - షూటింగ్ టైమ్ లో పాటలు విని ‘ఖుషి’ ఆల్బమ్ లవ్ లో పడిపోయాను. ఇక్కడ లైవ్ లో పాటలు వింటుంటే టైమ్ ను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి సెప్టెంబర్ 1న మీ అందరితో సినిమా చూడాలని అనిపిస్తోంది. మేమెప్పుడూ మీ అందరికీ నచ్చే సినిమా ఇవ్వాలని కోరుకుంటాం. ఈ సినిమాతో అలాంటి ప్రయత్నమే చేశాం. మైత్రీ ప్రొడ్యూసర్స్ నా ఫేవరేట్  ప్రొడ్యూసర్స్. నా ఫేవరేట్ హ్యూమన్ బీయింగ్స్ కూడా వాళ్లే. గత ఏడాదిగా నాకు వాళ్లు ఇస్తున్న సపోర్ట్ మర్చిపోలేను. నా కెరీర్ లో మెమొరబుల్ మూవీ ‘ఖుషి’ . ఇందులో నటించే అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ శివ గారికి థాంక్స్. హేషమ్ గారికి తెలుగు ఆడియెన్స్ లవ్ తెలియదు. ఇప్పుడు చూస్తున్నారు. వాళ్లు ప్రేమిస్తే ఎంత బాగా అభిమానిస్తారో ఆయనకు ఇప్పుడు తెలుస్తుంటుంది. ‘ఖుషి’ లో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వారి కాంట్రిబ్యూషన్ సినిమాకెంతో బలాన్నిచ్చింది. మీరు చూపించే ప్రేమ కోసం హెల్దీగా తిరిగి వస్తాను. బ్లాక్ బస్టర్ ఇస్తాను. అని చెప్పింది.