గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (16:56 IST)

సఖి, బొంబాయి స్తూర్తిగా తీసుకొని సినిమాటో గ్రాఫర్ అయ్యా- రాజ్ కె నల్లి

Cinematographer Raj K Nalli
Cinematographer Raj K Nalli
మన ముగ్గురి లవ్ స్టోరీ, సెబాస్టియన్ PC 524, పంచ తంత్రం వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకొన్న సినిమాటోగ్రాఫర్ రాజ్ కె నల్లి తాజా చిత్రం "నేను మీకు బాగా కావాల్సినవాడిని". కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం,సంజ‌న ఆనంద్‌, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్క‌ర్‌, భరత్ రొంగలి నటీ నటులుగా శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామ‌కృష్ణ  ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తుచిత్ర‌మిది. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై 8న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్బంగా  సినిమాటోగ్రాఫర్ రాజ్ కె. నల్లి పాత్రికేయులతో ప‌లు విష‌యాలు పంచుకున్నారు.
 
- చిన్నప్పుడు సఖి, బొంబాయి సినిమాలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని సినిమాటో గ్రాఫర్ గా అవుదామనుకున్నాను.ఆలా నేను 2014 లో మైండ్ స్క్రీన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీ కోర్స్ పూర్తి చేసుకొన్నాను. ఆ తరువాత  "రారండోయ్ వేడుక చూద్దాం", అర్జున్ సురవరం, దేవదాస్, ఉప్పెన సినిమాలకు అసోసియేట్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశాను. ఉప్పెన సినిమా పూర్తయ్యే టైంలో  కృష్ణ వంశీ గారు "రంగ మార్థండ" కు సినిమా సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసే అవకాశం కల్పించారు..ఆ తరువాత "సెబాస్టియన్ PC 524" ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. ఆ సినిమా పూర్తి అవ్వగానే "పంచతంత్రం" చేశాను ఆ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.కిరణ్ తో ఇంతకుముందు సెభాస్టియన్ చేసిన కారణంగా తను తరువాత చేయబోయే "నేను మీకు బాగా కావాల్సినవాడిని" సినిమా చేసే అవకాశం రావడం జరిగింది 
 
- కిరణ్ తో నాకిది రెండవ ప్రాజెక్ట్. కిరణ్ ను డిఫరెంట్ గా చూపించాలని తనను కొత్తగా చూపించడం జరిగింది. అయితే కిరణ్ సినిమా సినిమాకు ఇంప్రూవ్ అవ్వడానికి తను చాలా కష్టపడతాడు. కిరణ్ చాలా కూల్ గోయింగ్ యాక్టర్. తనకు లైనప్ లో 10 సినిమాలున్నాయి. తనకు ఎంత టెన్షన్ ఉన్నా సీన్ దగ్గరికి వచ్చేసేరికి సీన్ ఎమోషన్స్  మూడ్ పర్ఫెక్ట్ గా ఎక్స్ ప్రెస్ చేస్తాడు.
 
- చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదె తో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తను బేసిగ్ గా ఎడిటర్ కాబట్టి ఎడిటర్ పాయింట్ అఫ్ వ్యూ లో షాట్ మేకింగ్ చాలా ఇంట్రెసింగ్ గా ఉంటుంది 
 
- చిత్ర నిర్మాత దీప్తి ఎంత  ప్రెజర్ స్విచ్వేషన్ లో ఉన్నా ఆ టైమ్ ను కూల్ గా చాలా పాజిటివ్ గా హ్యాండిల్ చేస్తుంది.టెక్నిషియన్స్ కు ఫుల్ సపోర్ట్ ఇస్తూ తన వర్క్ ను రాబట్టుకుంటుంది. సెట్ వర్క్ గానీ, ప్రి ప్రొడక్షన్ వర్క్ ఉన్నా అందరితో పాటు లేట్ నైట్ వరకు ఉండి ప్రతి సీన్ చెక్ చేసుకొని వెళ్తుంది. ఒక నిర్మాతగా తనకు ఆ అవసరం లేకపోయినా సినిమాపై  తనకున్న ప్యాషన్ తో సినిమా బాగా రావాలని తపన పడుతుంటారు.
 
- మణిశర్మ పాటలు వింటూ పెరిగిన నేను ఇప్పుడు తనతో వర్క్ చేయడం ఒక ఫ్యాన్ తన కలను నిజం చేసుకున్న ఫీల్ ఫీల్ కలుగుతుంది.ఈ సినిమాలోని పాటలకు ప్రేక్షకులనుండి మంచి స్పందన  రావడం చాలా సంతోషంగా ఉంది 
 - ప్రస్తుతం "పంచతంత్రం"  సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అలాగే కృష్ణ వంశీ  దర్శకత్వంలో  వస్తున్న "రంగ మార్థండా" సినిమా ఒక్క రోజు షూట్ పెండింగ్ ఉంది. మరియు ప్రమోద్ హర్ష దర్శక్తవంలో నివేదా  పేతురాజ్ సినిమా చర్చలు నడుస్తున్నాయి అని చెప్పారు.