శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 ఆగస్టు 2018 (16:56 IST)

ఆమెను మా ఆయన అలా చేయడం చాలా బాగుంది : సమంత

అక్కినేని నాగ చైతన్య, అనూ ఎమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం "శైలజా రెడ్డి అల్లుడు". ఈ చిత్ర టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఆ చిత్రంలోని ఓ వీడియో పాటను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. 'అను

అక్కినేని నాగ చైతన్య, అనూ ఎమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం "శైలజా రెడ్డి అల్లుడు". ఈ చిత్ర టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఆ చిత్రంలోని ఓ వీడియో పాటను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. 'అను బేబీ.. అలాకొచ్చిన అణుబాంబులా అలా చూడకే' అంటూ ఈ పాట సాగుతోంది. సాంగ్ కలర్ఫుల్‌గా ఉండటంతో పాటు శ్రావ్యమైన ట్యూన్‌తో ఆకట్టుకునే పదాలతో అద్భుతంగా ఉంది.
 
ఈ పాటను చూసిన నాహ చైతన్య సతీమణి, హీరోయిన్ సమంత తన స్పందనను తెలియజేసింది. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. 'ఈ పాట చాలా బాగుంది... నాకెంతగానే నచ్చింది' అని పేర్కొంది. 
 
నాగ చైతన్య సినిమాలను సమంత ట్వీట్ చేస్తూ ప్రమోట్ చేస్తుంటుంది. సమంత సినిమాలను నాగచైతన్య ప్రమోట్ చేస్తుంటాడు. యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన ఈ సాంగ్ ఇప్పటికే ఆకట్టుకుంటోంది. మరి సినిమా ఎలా ఉంటుందో ఈనెలాఖరు వరకు వేచిచూడాల్సిందే.