1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 4 జూన్ 2018 (16:31 IST)

సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడుతో చైతూ హిట్ కొడతాడా?

నాగచైతన్య, మాధవన్, భూమిక కీలకపాత్రలు పోషిస్తున్న సినిమా సవ్యసాచి. ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఇందులో కోలీవుడ్ హీరో మాధవన్ ప్రతిన

నాగచైతన్య, మాధవన్, భూమిక కీలకపాత్రలు పోషిస్తున్న సినిమా సవ్యసాచి. ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఇందులో కోలీవుడ్ హీరో మాధవన్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు. చైతూ అక్కగా  భూమిక పోషిస్తోంది. భూమికను ప్రేమించే వ్యక్తిగాను.. ద్వేషించే వ్యక్తిగాను మాధవన్ పాత్ర వుంటుందట. 
 
ఈ సినిమాలోని ఒక కీలకమైన సన్నివేశంలో భూమిక గాయపడుతుంది. ఈ ఘటనకు తర్వాత సన్నివేశాల కోసం రెండు వెర్షన్లను దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. ఇకపోతే.. యాక్షన్, ఎమోషన్‌తో పాటు కామెడీ కూడా పండించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమాలో చైతూ జోడీగా నిధి అగర్వాల్ కనిపించనున్న సంగతి తెలిసిందే. 
 
మరోవైపు సవ్యసాచి సినిమాను పూర్తి చేస్తూనే నాగచైతన్య మరోవైపు మారుతి దర్శకత్వంలో ''శైలజా రెడ్డి అల్లుడు'' తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను, రెండు పాటలను చిత్రీకరించారు. 
 
తెలుగు రాష్ట్రాలు కాకుండా రెస్ట్ ఆఫ్ ఇండియా శాటిలైట్, డిజిటల్ హక్కులు కలుపుకుని నిర్మాతకి 14 కోట్ల వరకూ ముట్టినట్టుగా సమాచారం. ఇందులో కీలక పాత్రను రమ్యకృష్ణ పోషిస్తుండగా, చైతూ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. ఇంకేముంది..? సవ్యసాచి, శైలజా రెడ్డితో చైతూ హిట్ కొట్టేస్తాడని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.