సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు.. జైలర్‌తో బంపర్ హిట్. ఆస్తులెంత?
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ వున్నారు. అద్భుతమైన నటనతో ఆ మ్యానరిజంతో ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాడు. ఆయన స్టైల్‌కి రాని ప్రేక్షకులు కూడా ఉండరంటే అతిశయోక్తి కాదు.
తమిళ సినీ పరిశ్రమకు చెందిన వాడు అయినప్పటికీ దేశ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. జపాన్, సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో ఆయనకు అభిమానులున్నారు. కూలీగా, కార్పెంటర్‌గా, బస్ కండక్టర్‌గా పనిచేసిన రజనీ సినిమా రంగంలోకి అడుగుపెట్టి సూపర్‌స్టార్‌గా ఎదిగారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నట జీవితాన్ని ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి చేరుకున్నారు.
రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించారు
. తన సినిమాలతో ఎందరో దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
1975లో తమిళ చిత్రం అపూర్వ రాగంగల్ తో మొదలైన ఆయన సినీ ప్రయాణం ఇప్పుడు 172వ చిత్రానికి చేరుకుంది. ఇటీవల ఆయన నటించిన జైలర్ సినిమా దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.1000 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా రజనీకాంత్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది.
రజనీకాంత్ ఆస్తుల విలువ ఎంత?
ఫోర్బ్స్ మ్యాగజైన్ 2010లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గుర్తింపు పొందారు. అతని నికర విలువ 52 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 430 కోట్లు. గత కొంత కాలంగా రజనీకాంత్ రూ. 50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. సినిమా బాగా రాకపోతే అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేవారు.