కొరటాల సెంటిమెంట్ పండుతుందా?: ప్రభాస్, మహేష్‌కి తర్వాత సమంత కాళ్లు పట్టుకోనున్న ఎన్టీఆర్!!
కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న జనతా గ్యారేజ్ సినిమా సెంటిమెంట్స్ సీన్స్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న జనతా గ్యారేజ్ సినిమా సెంటిమెంట్స్ సీన్స్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే దేవయాని-ఎన్టీఆర్‌లపై ఓ సెంటిమెంట్ సీన్ తీస్తుండగా.. దేవయాని సీన్ తీసేశాక కూడా అలానే ఏడుస్తూ ఉండిపోయింది. తాజాగా సెంటిమెంట్ బాగా పండాలని ఎన్టీఆర్ హీరోయిన్ సమంత కాలు పట్టుకున్నాడట. ప్రస్తుతం ఇదే టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.
కొరటాల శివ ముందు తీసిన మిర్చి సినిమాలోనూ "ఇదేదో బాగుందే చెలి" అనే పాటలో అనుష్క పాదాలను తడుముతూ ప్రభాస్ నెయిల్ పాలిష్ వేస్తాడు. ఇక రెండో చిత్రం 'శ్రీమంతుడు'లోనూ "జత కలిసే'' పాటలో శ్రుతిహాసన్ కాళ్ళను మహేష్ పట్టుకుంటాడు. అంటే.. హీరోయిన్ల పాదాలను హీరో పట్టుకోవడమనే సెంటిమెంట్‌ని కొరటాల ఫాలో అవుతున్నట్లు సమాచారం.
ఇదే సెంటిమెంట్‌ని జనతా గ్యారేజ్ మూవీలోనూ అతడు ఫాలో అవుతాడా? అనే విషయంపై ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. అంటే.. ఆ ఇద్దరి హీరోల్లాగే గ్యారేజ్ మూవీలో సమంత కాళ్ళను ఎన్టీఆర్ పట్టుకుంటాడా? అని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు. అలా చేస్తే జనతా గ్యారేజ్ కూడా హిట్టే మరి అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిలీజ్‌కు ముందే పండగ చేసుకుంటున్నారట!.