గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 12 జులై 2017 (16:40 IST)

తమిళ బిగ్‌బాస్ షోపై ఫిర్యాదు.. 75శాతం నగ్నంగా నటిస్తున్నారు.. కమల్‌తో పాటు వారిని?

తమిళ బిగ్‌బాస్ షోపై వ్యతిరేకత మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్ బాస్ షోకు వ్యతిరేకంగా పలు పోస్టులు, సైటైర్లు వెల్లువెత్తుతున్నాయి. కాగా విజయ్ టీవీలో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షోను లెజెండ్ యాక్టర్ క

తమిళ బిగ్‌బాస్ షోపై వ్యతిరేకత మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్ బాస్ షోకు వ్యతిరేకంగా పలు పోస్టులు, సైటైర్లు వెల్లువెత్తుతున్నాయి. కాగా విజయ్ టీవీలో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షోను లెజెండ్ యాక్టర్ కమల్ హాసన్ నిర్వహిస్తున్నారు. 
 
ఈ షోపై ప్రారంభం నుంచే విమర్శలొచ్చినా.. అవే పాపులారిటీకి దారి తీశాయి. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం ఓ పోర్న్ షో అని.. ఈ షోలో పాల్గొనే నటీనటులు 75 శాతం నగ్నంగా నటిస్తున్నారని.. తమిళ గీతాన్ని హేళన చేస్తున్నారని హిందూ మక్కల్ కట్చి ఫిర్యాదు చేసింది.
 
ఈ మేరకు చెన్నై పోలీస్ కమిషనర్ వద్ద హిందూ మక్కల్ కట్చి ఫిర్యాదును అందజేసింది. భారత సంస్కృతిని ఈ షో గంగలో కలుపుతుందని.. బిగ్ బాస్‌ను నిషేధించాలని హిందూ మక్కల్ కట్చి డిమాండ్ చేసింది. ఇంకా యాంకర్ కమల్ హాసన్‌తో పాటు ఆ షోలో పాల్గొనే నటీనటులను అరెస్ట్ చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. కాగా కమల్ హాసన్ నిర్వహించే బిగ్ బాస్ షో జూన్ 24 నుంచి ప్రారంభమైంది. 
 
ఈ షోకు బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) ద్వారా తొలి ఎపిసోడ్‌కు 3.4 మిలియన్ ఇంప్రెషన్స్ మాత్రమే వచ్చాయి. ఇవి మిగిలిన సీరియళ్లకు వచ్చే రేటింగ్ కంటే తక్కువేనని తేలింది. ఈ నేపథ్యంలో హిందూ మక్కల్ కట్చి కూడా ఈ షోపై ఫిర్యాదు చేయడం వివాదానికి దారితీసింది.