ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (11:08 IST)

'గౌతమీపుత్ర శాతకర్ణి' దర్శనిర్మాత ఇళ్లపై ఐటీ దాడులు.. బాలకృష్ణకు మినహాయింపు

'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం దర్శక నిర్మాతలు, పంపిణీదారుల ఇళ్ళు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. డైరెక్టర్ క్రిష్, నిర్మాత వై.రాజీవ్ రెడ్డిల ఇళ్ళు, ఆఫీసులపై మంగళవారం రాత్రి ఆకస

'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం దర్శక నిర్మాతలు, పంపిణీదారుల ఇళ్ళు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. డైరెక్టర్ క్రిష్, నిర్మాత వై.రాజీవ్ రెడ్డిల ఇళ్ళు, ఆఫీసులపై మంగళవారం రాత్రి ఆకస్మికంగా దాడులు జరిపారు. ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఫస్ట్ ఫ్రేం ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, బెబో శ్రీనివాస్ సుమారు రూ.45 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెల్సిందే. అయితే ఈ సినిమా వసూళ్ళ వివరాలను రహస్యంగా ఉంచారు. ఈ చిత్ర నైజాం ప్రాంత హక్కులను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ సుధాకర రెడ్డి ఇంటిలో సుమారు ఎనిమిది గంటల పాటు సోదాలు జరిగాయట. 
 
ఇదిలావుండగా ఈ చిత్ర హీరో బాలకృష్ణ ఇంట్లో మాత్రం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించేలేదు. దీనిపై భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఈ చిత్ర యూనిట్ సభ్యులపై జరిగినవి ఐటీ దాడులు కావనీ, కేవలం సర్వేలు మాత్రమేనని ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమా వసూళ్ళకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి.