గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (15:21 IST)

అమ్మాయిగా బ్రతకడం చాలా ఇష్టం.. సర్జరీ సంగతి అనవసరం.. సాయి

Sai
Sai
జబర్దస్త్ కమెడియన్స్ కూడా ఏకంగా సర్జరీల ద్వారా అమ్మాయిలుగా మారిపోయి అందరికి షాక్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో మంది అబ్బాయిలు లేడీ గెటప్స్ వేయటం వల్ల చాలా మంది సర్జరీ చేయించుకుని నిజంగానే అమ్మాయిలుగా మారిపోయారు.
 
ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సాయితేజ ఎన్నో లేడీ గెటప్స్ వేసి అనంతరం సర్జరీ చేయించుకొని అమ్మాయిగా మారారు. ఇప్పుడు ఈమె ప్రియాంక సింగ్‌గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఈమె బాటలోనే మరొక కమెడియన్ కూడా సర్జరీ చేయించుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి.
 
జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్‌గా కొనసాగుతున్నటువంటి సాయి సర్జరీ ద్వారా అమ్మాయిగా మారిపోయారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం సాయి అమ్మాయిగా ఉన్నటువంటి ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
 
జబర్దస్త్ కార్యక్రమంలో ఎన్నో స్కిట్లలో అమ్మాయిగా నటించినటువంటి సాయి సర్జరీ చేసుకొని అమ్మాయిలాగే మారిపోయారనే వార్తలపై స్పందించారు. తాను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని కాకపోతే తనకు అమ్మాయిగా బ్రతకడం చాలా ఇష్టం అని తెలిపారు. 
 
చిన్నప్పటినుంచి చీరలు కట్టుకోవడం నాకు ఎంతో ఇష్టం అందుకే ఇలా అమ్మాయిగా చీరలు కట్టుకొని నాకు నచ్చిన విధంగానే నేను బ్రతుకుతున్నానని అయితే నేను సర్జరీ చేయించుకున్నానా లేదా అనేది ఇతరులకు అనవసరం అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు.