శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (12:16 IST)

ప్రేయసిని పెళ్లాడిన కమెడియన్ మహేశ్ విట్టా

Mahesh Vitta
Mahesh Vitta
టాలీవుడ్ కమెడియన్ మహేశ్ విట్టా తన ప్రేయసిని వివాహం చేసుకున్నాడు. తన ప్రేయసి శ్రావణి రెడ్డిని ఆయన వివాహం చేసుకున్నాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక ఫంక్షన్ హాల్‍‌లో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. 
 
వీరి వివాహానికి బిగ్ బాస్-3 కంటిస్టెంట్స్ పాల్గొన్నారు. ఇంకా సినీ ప్రముఖులు హాజరయ్యారు. యూట్యూబర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన మహేశ్ విట్టా.. త్వరితకాలంలోనే టీవీ రంగంలోకి అడుగుపెట్టాడు. చిత్తూరు జిల్లా యాసతో పలు సినిమాల్లో ఆయన ఆకట్టుకున్నాడు. 
 
కృష్ణార్జున యుద్ధం, శమంతకమణి, టాక్సీవాలా, అల్లుడు అదుర్స్ వంటి చిత్రాల్లో నటించాడు. ఆపై బిగ్ బాస్‌లో పాల్గొన్నాడు. 60 రోజుల పాటు హౌస్‌లో వుండి.. పాపులర్ అయ్యాడు.