సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2023 (11:11 IST)

పవన్ బ్రోపై వైకాపా ఫైర్.. పూనమ్ కౌర్‌ సెటైర్లు.. వద్దు సిస్టర్ అన్న వర్మ..

poonam kaur
జనసేన అధినేత, నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ జంటగా ఇటీవల విడుదలైన బ్రో చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతూ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందుకు సముద్రఖని దర్శకత్వం వహించారు. 
 
ఈ సినిమా ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపింది. గతంలో సంక్రాంతి సంబరాల్లో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చేసిన నృత్యానికి సంబంధించిన పేరడీ వివాదానికి దారితీసింది. బ్రో సినిమాలో ఓ సీన్‌లో కమెడియన్ పృథ్వీ మంత్రి అంబటి రాంబాబును ఇమిటేట్ చేస్తూ డ్యాన్స్ చేయడంతో పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. 
 
దీనిపై ఇప్పటికే అంబటి రాంబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. మరోవైపు ఈ విషయంపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ కూడా స్పందించింది. 
 
తాజా రాజకీయాలు, బ్రో సినిమా వివాదాలను దృష్టిలో పెట్టుకుని పూనమ్ కౌర్ సెటైర్లు వేసింది. రాజకీయాలు వినోదాత్మకంగా మారాయని, వినోదం అంత సీరియస్‌గా మారిందని ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ: వద్దు సిస్, నిజానికి రాజకీయాలు సినిమాగా మారాయని, సినిమా రాజకీయంగా మారిందని అనుకుంటున్నాను... అంటూ వర్మ తెలిపాడు.