1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2023 (13:27 IST)

హీరోయిజం నుంచి జీరోయిజంకు పడిపోయిన పవన్ : ఆర్జీవీ విమర్శలు

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు విమర్శలు ఎక్కుపెట్టారు. హీరోయిజం నుంచి జీరోయిజంకు పవన్ కళ్యాణ్ పడిపోయారంటూ సెటైర్లు వేశారు. ఇదే విషయంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
"ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ పవర్ స్టార్ కన్నీళ్లు పెట్టుకుంటూ అడుక్కుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఆయన కులం వ్యక్తులు, అభిమానుల గుండెల్లో హీరోయిజం నుంచి జీరోయిజంకు పవర్ స్టార్ పడిపోయారని గుర్తుచేశారు. వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ, జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీ ఈ తరహా సెటైరికల్ ట్వీట్ చేశారు.