గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : శనివారం, 22 ఏప్రియల్ 2023 (18:21 IST)

ఓ మంచి ఘోస్ట్ గ్లింప్స్ ఆవిష్కరించిన భూత్ ధరకుడు రామ్ గోపాల్ వర్మ

Varama, Anup Rubens,and others
Varama, Anup Rubens,and others
మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రుబెన్స్ సమర్పణలో, మార్క్ సెట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై  డాక్టర్ అబినికా ఐనభాతుని నిర్మాత  గా  శంకర్ మార్తాండ్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఓఎమ్ జీ. ఓ మంచి ఘోస్ట్ అనే ట్యాగ్ లైన్ తో హర్రర్ కామెడీ జోనర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్.. గ్లింప్స్ ని ప్రముఖ తెలుగు సెన్సెషనల్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేతులు మీదుగా ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. తన చేతులు మీదుగా పోస్టర్ ను రివీల్ చేయడం సంతోషంగా ఉందని, సినిమా పోస్టరే చాలా ఆసక్తిగా ఉందని చెప్పారు. నిజానికి ఘోస్ట్ అంటే ఓ నెగిటీవ్ ఫోర్స్ ఉంటుందని ప్రచారం ఉంది దానికి పూర్తి వ్యతిరేకంగా ఓ మంచి ఘోస్ట్ అనే టైటిల్ అండ్ కాన్సెప్ట్ బాగుందని, ఈ సినిమా ప్రేక్షకలుకు సైతం బాగా కనెక్ట్ అవుతుందని, ఓఎమ్ జీ టీమ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ఓ హర్రర్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే మా ప్రయాత్నాన్ని సపోర్ట్ చేసినందుకు ఆర్జీవికి కృతజ్ఙతలు తెలిపారు. డైరెక్టర్ శంకర్ మార్తాండ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఆద్యాంతం హర్రర్ కామెడీ తో ప్రేక్షకులను అలరిస్తుందని, ఇలాంటి సబ్జెక్ట్ రాసుకోవడానికి ఆర్జీవినే స్పూర్తి అని తెలిపారు. ఇది కచ్చితంగ ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా తెలిపారు. అలాగే సినిమా పూర్తి అయిన తరువాత కచ్చితంగా మాతో కలిసి చూడాలని ఆర్జీవి దగ్గర మాట తీసుకున్నారు. వెన్నెల కిశోర్, శకలక శంకర్, కమెడియన్ రఘు తదితరులు నటిస్తున్నట్లు తెలుస్తుంది.