సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 జూన్ 2023 (17:46 IST)

రామ్ గోపాల్ వర్మ చేత తాగుదాం తాగి ఊగుదాం అనిపించిన బూట్‌కట్ బాలరాజు

Varma-sohel
‘బిగ్‌‌బాస్’ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ లో శ్రీ కోనేటి దర్శకత్వంలో ఎండీ పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్‌కట్ బాలరాజు. మేఘలేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎండీ పాషా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
తాజాగా ఈ చిత్రం నుంచి తాగుదాం తాగి ఊగుదాం పాటని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ధమాకా కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ పాటని తనదైన స్టయిల్ లో మాస్ నెంబర్ నెంబర్ గా కంపోజ్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్, సాయి మాధవ్ మాస్ ఎనర్జీ తో పాడిన ఈ పాటకు అఫ్రోజ్ అలీ క్యాచి లిరిక్స్ అందించారు. ఈ పాటలో సోహెల్ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి.
 
ఈ చిత్రానికి ప్రముఖ డీవోపీ శ్యామ్ కె నాయుడు కెమరామెన్ గా పని చేస్తున్నారు. విజయ్ వర్ధన్ ఎడిటర్ కాగా విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్.  
 
నటీనటులు: సయ్యద్ సోహెల్ ర్యాన్, మేఘలేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ, అవినాష్, సద్దాం, ‘కొత్త బంగారు లోకం’ వివేక్