సోహెల్ కు బూట్ కట్ బాలరాజు కలిసొస్తుందా!
బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాలని చేసుతున్నాడు. కానీ ఏది వర్క్ అవుట్ కాలేదు. కృష్ణ రెడ్డితో సినిమా తీసిన డిజాస్టర్ అయింది. అయినా మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో ఒకటి బూట్ కట్ బాలరాజు. మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎం.డీ పాషా నిర్మిస్తున్నారు.
ధమాకా కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ పాటని తనదైన శైలిలో ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా స్వరపరిచారు. శ్యామ్ కాసర్ల అందించిన సాహిత్యం ఈ పాటకు మరింత సొగసుని తీసుకొచ్చింది. స్వాతి రెడ్డి వాయిస్ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ పాట లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది.
ఈ చిత్రానికి ప్రముఖ డీవోపీ శ్యామ్ కె నాయుడు కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. విజయ్ వర్ధన్ ఎడిటర్ కాగా విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్.