మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 4 జులై 2023 (16:11 IST)

నీతులు చెప్పి స్టేజ్‌పై జీవితాలతో ఆడుకునేవారు గురువు కాదు : పూనమ్ కౌర్

poonam kaur
సినీ నటి పూనమ్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురుపూర్ణిమ సందర్భంగా తన ఇన్‌స్టా ఖాతాలో ఆమె ఓ స్టోరీని షేర్ చేశారు ప్రతి ఒక్కరినీ గురువు అని పిలవొద్దని సూచించారు. మీకు దారి  చూపించేవారు మాత్రమే గురువు అవుతారని చెప్పారు. ఇదే అంశంపై ఆమె చేసిన ట్వీట్ ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఇద్దరు ప్రముఖులను పరోక్షంగా ఉద్దేశించే ఆమె ఈ ట్వీట్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
"మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను.. ప్రతి టామ్, డిక్ అండ్ హారీని గురువు అని పిలవద్దు. నీతులు చెప్పి స్టేజ్‌ మీద జీవితాలతో ఆడుకునేవాడు గురువు కాదు. మీకు దారి చూపించేవారు గురువు అవుతారు" అని రాసుకొచ్చింది. 
 
అయితే పూనమ్ కౌర్ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారనే చర్చ సాగుతోంది. ఎవరిని టార్గెట్ చేశారు. ఎవరికి సలహాలు ఇస్తున్నారన్న చర్చ సాగుతోంది. టాలీవుడ్‌‍లో ఓ ప్రముఖ దర్శకుడిని గురూజీ అని  పిలుస్తారు. ఆయన్నే టార్గెట్ చేసుకుని పూనమ్ విమర్శలు చేసిందనే నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.