గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

సీఎం జగన్ దృష్టిలో గ్రాఫ్ పడిపోయిన వైకాపా ఎమ్మెల్యేలు విరేనా?

ysrcp flag
వచ్చే ఎన్నికల్లో గ్రాఫ్ పడిపోయిన వారిని పక్కనపెట్టేస్తానని వైకాపా అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించి పార్టీ నేతల్లో వణుకు పుట్టించారు. ముఖ్యంగా, ఏమాత్రం యాక్టివ్‌గా లేని ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వబోనని తేల్చి చెప్పారు. అలాంటి ఎమ్మెల్యేలు ఇప్పటికైనా తీరు మార్చుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ జాబితా ప్రకారం వైకాపాకు చెందిన 151 మంది ఎమ్మెల్యేల్లో పనితీరు ఏమాత్రం బాగాలేదని భావిస్తున్న 40 మంది శాసనసభ్యుల జాబితా ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
ఆ జాబితాలో ఉన్న ఎమ్మెల్యేల పేర్లను పరిశీలిస్తే, రెడ్డి శాంతి(పాతపట్నం), గొర్రె కిరణ్ కుమార్(ఎచ్చెర్ల) సొంత కేడర్ నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కంబాల జోగులు(రాజాం), శంబంగి వెంకట చిన అప్పలనాయుడు(బొబ్బిలి), కడుబండి శ్రీనివాసరావు(శృంగవరపు కోట), తిప్పల నాగిరెడ్డి(గాజువాక), ముత్తంశెట్టి శ్రీనివాసరావు (భీమిలీ), అన్నం రెడ్డి ఆదీఫ్రిజ్ (పెందుర్తి), యూవీ రమణమూర్తి రాజు (ఎలమంచిలి), గొల్ల బాబూరావు (పాయకరావు పేట), ఉమాశంకర్ గణేశ్ (నర్సీపట్నం), పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ (ప్రత్తిపాడు), జక్కంపూడి రాజా (రాజానగరం) కొండేటి. 
 
చిట్టిబాబు (పి.గన్నవరం), జి.శ్రీనివాసనాయుడు, శ్రీరంగనాథరాజు (ఆచంట), కొట్టు సత్యనారాయణ (తాడేపల్లిగూడెం), ఉప్పాల శ్రీనివాస్ (ఉంగుటూరు), ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఏలూరు), తలారి వెంకటరావు(గోపాలపురం), వెలంపల్లి శ్రీనివాస్ (విజయవాడ పశ్చిమ), మల్లాది విష్ణు (విజయవాడ సెంట్రల్), మొండితోక జగన్మోహనరావు (నందిగామ), సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట), పేర్ని వెంకటేశ్వరరావు (మచిలీపట్నం), ఆళ్ల రామ కృష్ణారెడ్డి (మంగళగిరి), నంబూరి శంకరరావు (పెదకూరపాడు), మేకతోటి సుచ రిత (ప్రత్తిపాడు), షేక్ మహమ్మద్ ముస్తాఫా (గుంటూరు తూర్పు), అంబటి రాంబాబు (సత్తెనపల్లి), కుందూరు నాగార్జునరెడ్డి (మార్కాపురం), కిలివేటి సంజీవయ్య (సూళ్లూరుపేట), తోగూరు అర్థర్ (నందికొట్కూరు), గుమ్మనూరి జయరాం (ఆలూరు), శెట్టిపల్లి రఘురామిరెడ్డి (మైదుకూరు), వై.వెంకట్రామిరెడ్డి (గుంతకల్లు), ఎం. శంకరనారాయణ (పెనుకొండ), మహమ్మద్ నవాజ్ బాషా (మదనపల్లి).
 
కోనేటి ఆదిమూలం (సత్యవేడు), శ్రీనివాసులు (చిత్తూరు), ఎన్. వెంకటగౌడ(పలమనేరు), కొరముట్ల శ్రీనివాసులు (రైల్వేకోడూరు) ఉన్నారు. అయితే ఎన్నికల నాటికి ఈ సంఖ్య రెట్టింపయినా ఆశ్చర్యం లేదని వైసీపీ నేతలే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. 175 స్థానాల్లో పోటీకి అభ్యర్థులను నిలబెట్టగలరా అంటూ ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్న జగన్.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మేకపాటి చంద్రశేఖర రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మినహా గత ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగిన వారందరినీ జగన్ ఈసారి పోటీకి దింపగలరా అని విపక్షాలు సవాల్ విసురుతున్నాయి. ప్రభుత్వానికి ప్రజా మద్దతు ఉంటే ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం ఏముందని నిలదీస్తున్నాయి.