గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 1 జులై 2023 (17:49 IST)

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో మొదటి స్టోర్‌ను ప్రారంభించిన టాటా స్టార్‌బక్స్

image
టాటా స్టార్‌బక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఒక కొత్త స్టోర్ ప్రారంభించింది, దాని స్టోర్లను దేశవ్యాప్తంగా 45 నగరాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్‌బక్స్ మార్కెట్‌ల వృద్ధికి కంపెనీ యొక్క దీర్ఘకాలిక నిబద్ధతను హైలైట్ చేస్తూ, భారతదేశంలో350 స్టోర్‌లతో స్థానిక కమ్యూనిటీలకు సేవలందిస్తున్న బ్రాండ్‌కు ఈ నూతన స్టోర్ ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
 
“ఒక దశాబ్దానికి పైగా భారతదేశంలోని మా విలువైన కస్టమర్లకు సేవలందిస్తున్నందుకు అపారమైన గర్వంతో, ఇప్పుడు వైబ్రెంట్ కోస్టల్ సిటీ, విశాఖపట్నంలో మొదటి స్టార్‌బక్స్ స్టోర్‌ను ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది,” అని మిస్టర్ సుశాంత్ డాష్, సీఈవో, టాటా స్టార్‌బక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నారు. "టాటా స్టార్‌బక్స్ భారతదేశంలో దాని దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యానికి కట్టుబడి ఉంది, మేము ప్రణాలికబద్దంగా విస్తరించడం కొనసాగిస్తున్నందున, దేశవ్యాప్తంగా కొత్త మార్కెట్‌లకు స్టార్‌బక్స్ ఆనందాన్ని తీసుకువస్తున్నాము".
 
విశాఖపట్నంలోని కస్టమర్‌లు ఇప్పుడు జావా చిప్ ఫ్రాపుచినో, కేఫే మోచా, సిగ్నేచర్ హాట్ చాక్లెట్, కారమెల్ మకియాటో మొదలైన ఆల్-టైమ్ ఫేవరెట్ స్టార్‌బక్స్ హ్యాండ్‌క్రాఫ్ట్ పానీయాలను ఆస్వాదించవచ్చు. టాటా స్టార్‌బక్స్ ఈ స్టోర్‌లో చక్కని ఎంపికల శ్రేణిని కూడా ప్రవేశపెడుతుంది,  ఇందులో భాగంగా కొత్త మరియు మొదటిసారి వచ్చే కాఫీ ప్రియులు తమ ఇష్టమైన పానీయాలను ఆస్వాదించాలనుకునే వారి కోసం కొత్త పిక్కో కప్పు పరిమాణంతో అందించనుంది. ప్రియమైన క్లాసిక్‌లతో పాటు, స్టోర్‌లో ఫిల్టర్ కాఫీ, మసాలా చాయ్, ఏలకుల చాయ్, మిల్క్‌షేక్‌లు మరియు తాజాగా అసెంబుల్ చేసిన శాండ్‌విచ్‌లు, బైట్-సైజ్డ్ పరిమాణంలో ఉన్న ట్రీట్‌లు మరియు షేర్ చేసుకోదగిన ఆహార పదార్థాల వంటివి చేర్చబడ్డాయి. పునరుద్ధరించిన ఫుడ్ మెనూ పానినిలో పెస్టో & మోజారెల్లా శాండ్‌విచ్, భునా చికెన్ పఫ్, హాజెల్‌నట్ ట్రయాంగిల్, చాక్లెట్ ఎక్లెయిర్, ఎగ్ వైట్ & చికెన్ ఇన్ మల్టీగ్రెయిన్ క్రోయిసెంట్, రెడ్ వెల్వెట్ & ఆరెంజ్ కేక్, చిల్లీ చీజ్ టోస్ట్, బట్టరీస్ టోస్ట్ వంటి ఆకర్షణీయమైన ఆఫర్‌లను కలిగివుంది.
 
స్టోర్ విస్తృత శ్రేణి స్టార్‌బక్స్ ఐటమ్స్ మరియు ఉచిత Wi-Fiని కూడా అందిస్తుంది, తద్వారా కస్టమర్‌లు స్టార్‌బక్స్ ప్రసిద్ధి చెందిన ఎలివేటెడ్ కాఫీహౌస్ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు. అదనంగా, కంపెనీ స్టార్‌బక్స్ రివార్డ్స్ లాయల్టీ ప్రోగ్రామ్‌ను నగరానికి తీసుకువస్తుంది, ఆకర్షణీయమైన ప్రయోజనాలతో సభ్యులకు పరిచయం చేస్తుంది, దీనితో వారు  స్టార్‌బక్స్ ఇండియా కమ్యూనిటీలో భాగమయ్యే అవకాశాన్ని పొందవచ్చు,