సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

నటుడు వెంకీకి తృటిలో తప్పిన ప్రమాదం...

బుల్లితెర నటుడు, 'జబర్దస్త్' టీవీ నటుడు వెంకీకి త్రుటిలో తప్పిన ప్రమాదం తప్పింది. వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు స్వయంగా కారు డ్రైవింగ్‌ చేస్తూ వస్తుండగా ఆలేరు సమీపంలో త్రుటిలో ప్రమాదం తప్పింది.

బుల్లితెర నటుడు, 'జబర్దస్త్' టీవీ నటుడు వెంకీకి త్రుటిలో తప్పిన ప్రమాదం తప్పింది. వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు స్వయంగా కారు డ్రైవింగ్‌ చేస్తూ వస్తుండగా ఆలేరు సమీపంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. 
 
యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని ఆలేరు మండల సరిహద్దులో ఆర్టీసీ బస్సు వెంకీ కారును ఓవర్‌టేక్‌ చేసింది. ఇదే సమయంలో వెంకీ తన కారును కొద్దిగా స్లో చేయగా వెనుక నుంచి వచ్చిన ఇన్నోవా వాహనం అతివేగంతో ఢీ కొట్టింది. 
 
ఈ ప్రమాదంలో వెంకీ క్షేమంగా బయట పడగలిగాడు. ఇన్నోవా కారులోని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. రెండు కార్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంపై వెంకీ ఆలేరు పోలీస్‌ స్టేషనులో ఫిర్యాదు చేశాడు.