బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 6 జులై 2017 (18:20 IST)

సముద్రమంత ద...ధైర్యం వుండాల... ఎన్టీఆర్ నత్తి, జై లవకుశ టీజర్(వీడియో)

జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవకుశ చిత్రం టీజర్ రిలీజ్ అయ్యింది. యంగ్ టైగర్ విలనిజమ్ అదిరిపోయింది. రావణాసురుడికి నమస్కరించి ఆ తర్వాత గొడ్డలి చేతబట్టుకుని చెప్పే డైలాగులో ఎన్టీఆర్ నత్తినత్తిగా మాట్లాడే మాటలున్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ జై, ల‌వ‌, కుశ

జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవకుశ చిత్రం టీజర్ రిలీజ్ అయ్యింది. యంగ్ టైగర్ విలనిజమ్ అదిరిపోయింది. రావణాసురుడికి నమస్కరించి ఆ తర్వాత గొడ్డలి చేతబట్టుకుని చెప్పే డైలాగులో ఎన్టీఆర్ నత్తినత్తిగా మాట్లాడే మాటలున్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ జై, ల‌వ‌, కుశ అనే మూడు విభిన్న పాత్ర‌ల‌లో కనిపిస్తాడని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల చేయనున్నారు.
 
ఇది జై అనే పాత్ర‌కి సంబంధించిన టీజ‌ర్ అని చెపుతున్నారు. ఇది విలనిజమ్ చూపించే పాత్రగా కనిపిస్తోంది. ఇకపోతే మిగిలిన రెండు పాత్రలకు సంబంధించి టీజర్లు కూడా విడుదలవుతాయని అంటున్నారు. జై ల‌వ‌కుశ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రాశి ఖ‌న్నా, నివేదా థామ‌స్ నటిస్తున్నారు. ఇంకా సీకె ముర‌ళీధ‌ర‌న్, బాలీవుడ్ యాక్ట‌ర్ రోనిత్ రాయ్ ఇతర ముఖ్య పాత్ర‌ల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ రోజు విడుదలైన ఈ టీజర్‌ను చూడండి.