ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 జులై 2023 (14:30 IST)

Jawan Official Telugu Prevue: పుణ్యాత్ముడిగా.. పాపాత్ముడినా (వీడియో వైరల్)

Shahrukh Khan
తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడిగా వెలుగొందుతున్న అట్లీ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న 'జవాన్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు. 
 
యోగి బాబు, దీపికా పదుకొణె, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ఫిల్మ్ వరల్డ్‌లో మ్యూజిక్ కంపోజర్‌గా అరంగేట్రం చేశారు. పాన్ ఇండియా చిత్రంగా 'జవాన్' సెప్టెంబర్ 7న థియేటర్లలోకి రానుంది.
 
ఈ సందర్భంగా చిత్రబృందం 'జవాన్' సినిమా ప్రివ్యూ వీడియోను విడుదల చేసింది. అందులో షారూఖ్ ఖాన్ డైలాగ్స్ బాగున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోను అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.