1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 27 జూన్ 2023 (15:57 IST)

జీవితంలో కొన్నిసార్లు ఉపయోగపడేది అదే :షారూక్ ఖాన్‌

Shahrukh Khan
Shahrukh Khan
ఈ ఏడాది ప్రారంభంలో ప‌ఠాన్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌తో బాక్సాఫీస్ రికార్డుల‌ను కొల్ల‌గొట్టి త‌న స‌త్తా చాటారు బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్‌. సెప్టెంబ‌ర్ 7న మ‌రోసారి పాన్ ఇండియా లెవ‌ల్లో సంద‌డి చేయ‌టానికి ఆయ‌న సిద్ధ‌మ‌వుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే షారూక్ ఈ ఏడాదితో సినీ జ‌ర్నీతో 31 వ‌సంతాల‌ను పూర్తి చేసుకోవ‌టం విశేషం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న అభిమానులు, ఫాలోవ‌ర్స్‌తో #AskSRK  కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 
 
- ఓ మహిళా అభిమాని మాట్లాడుతూ ‘నేనిప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉన్నాను, డాక్ట‌ర్ క‌వ‌ల పిల్ల‌ల‌ని చెప్పారు. వారికి ప‌ఠాన్‌, జ‌వాన్ అనే పేర్లు పెట్టాల‌నుకుంటున్నా’న‌ని అన్నారు. దానికి షారూక్ బదులిస్తూ ఇంకా మంచి పేర్లు పెట్టాలని సూచించారు. 
 
- ఓ అభిమాని త‌న స్నేహితుడు కోసం జ‌వాన్‌లో పాత్ర‌ను ఇవ్వాల‌ని కోరారు. దానికి షారూక్ ఖాన్ స్పందిస్తూ.. ‘అలా చేయ‌టం కుద‌ర‌ని ప్రేమ‌తో మీ స్నేహితుడుకి అర్థ‌మ‌య్యేలా చెప్పండి’ అన్నారు. 
 
- జ‌వాన్ సినిమాకు సంబంధించిన ఓ ప్ర‌శ్న‌కు షారూక్ ఖాన్ బ‌దులిస్తూ ‘లేదు బిడ్డా.. స్నేహితులతో కలిసి థియేటర్‌లో ఎంజాయ్ చేయాల్సిందే’ అన్నారు. 
 
- జవాన్ టీజర్ గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘టీజర్ సిద్ధమవుతుంది. అందరూ ఎంజాయ్ చేసేలా సిద్ధం చేసి చూపిస్తా’నని అన్నారు. 
 
- గ్రాడ్యుయేషన్ పూర్తయ్యిందని చెప్పిన కొందరి నెటిజన్స్‌కు షారూక్ సమాధానం ఇస్తూ..ఆల్ ది బెస్ట్.. జీవితంలో మీరు నేర్చుకుంది ఉపయోగపడుతుంది.. కొన్నిసార్లు అని సమాధానం ఇచ్చారు.