1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 4 జనవరి 2017 (17:34 IST)

''అమ్మ'' బయోపిక్.. జయలలిత పాత్రలో రమ్యకృష్ణ లేదా హేమమాలిని.. దాసరి పక్కా ప్లాన్

బాలీవుడ్‌లో సెలెబ్రిటీలు, వీఐపీ, రాజకీయ నేతలు, క్రీడా రంగానికి చెందిన ఆటగాళ్ల జీవితాల ఆధారంగా బయోపిక్ సీజన్ నడుస్తోంది. ఈ ఫీవర్ ప్రస్తుతం దక్షిణాదిని తాకనుంది. ఇదే కోవలో తాజాగా తమిళనాడు దివంగత ముఖ్యమం

బాలీవుడ్‌లో సెలెబ్రిటీలు, వీఐపీ, రాజకీయ నేతలు, క్రీడా రంగానికి చెందిన ఆటగాళ్ల జీవితాల ఆధారంగా బయోపిక్ సీజన్ నడుస్తోంది. ఈ ఫీవర్ ప్రస్తుతం దక్షిణాదిని తాకనుంది. ఇదే కోవలో తాజాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితచరిత్ర ఆధారంగానూ ఓ సినిమాకి ప్లానింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దర్శకరత్న దాసరి నారాయణ రావు ఈ సినిమాని రూపుదిద్దేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఫిలిమ్ ఛాంబర్‌లో అమ్మ పేరుతో టైటిల్ కూడా రిజిస్టర్ అయ్యింది. 
 
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిగా, వివిధ భాషల్లో నటించిన సినిమా హీరోయిన్‌ కావడంతో అమ్మ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించే యోచనలో దాసరి వున్నారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో అమ్మ చిత్రాన్ని నిర్మించనున్న దాసరి జయలలిత పాత్ర కోసం నటీమణుల ఎంపికలో ఉన్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. ఇంకా ఈ సినిమాలో జయలలిత పాత్రకు హేమమాలిని లేదా రమ్యకృష్ణను ఎంపిక చేసే అవకాశం ఉంది. 
 
ప్రస్తుతానికి వీరిద్దరితోనూ దాసరి చర్చలు జరుపుతున్నారు. కేవలం నెల రోజుల్లోనే ఈ సినిమాను పూర్తి చేయాలనే యోచనలో దాసరి ఉన్నారు. ఇప్పటికే చిత్ర నిర్మాణానికి సంబంధించిన పనులను ప్రారంభమయ్యాయని తెలుస్తోంది.