గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2020 (19:45 IST)

సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని హత్య చేయవచ్చు.. చెప్పిందెవరంటే?

Rhea Chakraborty
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. కొత్త వ్యక్తుల ప్రకటనలు కూడా రికార్డ్ అవుతున్నాయి. తాజాగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై జేడీయు ప్రతినిధి రాజీవ్ రంజన్ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తులు తమను కాపాడుకునేందుకు రియా చక్రవర్తిని కూడా హత్య చేయవచ్చునని తెలిపారు. 
 
ఇప్పటికే ముంబై పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుశాంత్ కేసులో దర్యాప్తు కోసం ముంబై వెళ్లిన ఐపిఎస్ అధికారి వినయ్ తివారీని బిఎంసి నిర్బంధించడంతో ముంబై పోలీసులను ప్రజలు తప్పుబడుతున్నారు.  
 
ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి కూడా సుశాంత్ కేసులో చివరి సాక్షి, నిందితుడు అని రాజీవ్ రంజన్ పేర్కొన్నారు. మేనేజర్ దిషా సాలియన్ తర్వాత సుశాంత్ మరణం సంభవించింది. ఈ కేసులో ఏకైక సాక్షిగా రియా చక్రవర్తి మిగిలిపోయింది.  ఈ కేసులో పాల్గొన్న నిందితులు ఎప్పుడైనా రియా చక్రవర్తిని చంపవచ్చు. అందువల్ల, ఆమె స్టేట్మెంట్ కోర్టులో నమోదు చేసుకోవడం చాలా ముఖ్యమని రాజీవ్ చెప్పారు.