రియా చక్రవర్తి ఓ విషకన్య.. కాంట్రాక్ట్ కిల్లర్

sushanth singh_Rhea
sushanth singh_Rhea
ఠాగూర్| Last Updated: శుక్రవారం, 31 జులై 2020 (15:07 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు మలుపులు తిరుగుతోంది. ప్రతి ఒక్కరూ సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని దోషిగా చూస్తున్నారు. ఈ క్రమంలో రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... ఆమెను విచారించేందుకు బీహార్ పోలీసులు ముంబైకి వెళ్లారు. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్యపై పలువురు ప్రముఖులు అనుమానాలను వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో జేడీయూ నేత మహేశ్వర్ హజారీ మాట్లాడుతూ, రియా చక్రవర్తిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌ను హత్య చేశారని... దీని వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని ఆయన ఆరోపించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.

రియా ఒక కాంట్రాక్ట్ కిల్లర్‌గా వ్యవహరించిందని అన్నారు. ప్రేమ పేరుతో సుశాంత్‌ను మోసం చేసిందని... డబ్బు తీసుకుని, వెళ్లిపోయిందని చెప్పారు. ఆమె ఒక విషకన్య అని అన్నారు. ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే సుశాంత్ వద్దకు రియాను పంపించారని... ఈ కోణంలో విచారణ జరగాలని అన్నారు.

సుశాంత్ కేసును ముంబై పోలీసులు సరిగా విచారించడం లేదని... ఈ నేపథ్యంలో దీనిపై సీబీఐ విచారణ జరగాలని మహేశ్వర్ డిమాండ్ చేశారు. సుశాంత్ కుటుంబానికి బీహార్ ప్రభుత్వం అండగా ఉంటుందని... ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తుందని చెప్పారు. సుశాంత్‌కు న్యాయం జరగాలని సీఎం నితీశ్ కుమార్ కూడా కోరుకుంటున్నారని తెలిపారు.దీనిపై మరింత చదవండి :