ప్రియురాలి కారణంగానే సుశాంత్ సూసైడ్? ఎఫ్ఐఆర్ నమోదు!!

sushanth singh_Rhea
sushanth singh_Rhea
ఠాగూర్| Last Updated: బుధవారం, 29 జులై 2020 (08:53 IST)
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన ఇంట్లో జూన్ 14వ తేదీన ఆత్మహత్య చేసుకోగా, ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. సినీ ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం (బంధుప్రీతి) కారణంగానే సుశాంత్ ఈ దారుణానికి పాల్పడ్డారని అనేక మంది అభిప్రాయపడ్డారు.

దీనిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు.. తమ విచారణలో భాగంగా అనేక మంది బాలీవుడ్ ప్రముఖులను విచారిస్తున్నారు. ఇందులోభాగంగా, సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిని కూడా విచారించారు. ఇపుడు రియా చక్రవర్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయినట్లుగా ఏఎన్ఐ సంస్థ పేర్కొంది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రేమికురాలిగా ఉన్న రియాపై డబ్బుకు సంబంధించిన విషయంలోనూ, అలాగే సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి ఆమెపై ఆరోపణలు వస్తుండటంతో.. సుశాంత్ తండ్రి ఈ విషయం పోలీసులకు చెప్పడంతో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

పాట్నా నుంచి ఇప్పటికే పోలీస్ బృందం ముంబై వెళ్లినట్లుగా తెలుస్తుంది. పాట్నా సెంట్రల్ జోన్ ఐజీ సంజయ్ సింగ్ కూడా ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయాన్ని ధ్రువీకరించినట్లుగా ఏఎన్ఐ వార్తా సంస్థ తన ట్వీట్‌లో తెలిపింది.

అయితే సుశాంత్ ఆత్మహత్య విషయమై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని రియా ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరడంతో.. ఇప్పుడీ ఆత్మహత్య ఓ మిస్టరీగా మారింది.దీనిపై మరింత చదవండి :