గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జులై 2020 (17:40 IST)

సుశాంత్, రియాతో సినిమా.. ఇప్పుడేమో వ్యవసాయం చాలంటున్నాడు..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా దర్శకుడు రూమి జాఫ్రే స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఈయన వాంగ్మూలానికి అనంతరం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 
అసలు విషయం ఏంటంటే? సుశాంత్, అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో కలిసి రూమీ జాఫ్రే ఓ సినిమాకు ప్లాన్ చేశారు. కానీ ఉన్నట్టుండి సినిమాలు వద్దనుకుని వ్యవసాయం చేయాలనుకుంటున్నాడు. సుశాంత్‌కు రూమీ జాఫ్రే మంచి స్నేహితుడు. సుశాంత్ నటనకు గుడ్‌‌బై చెప్పి వ్యవసాయం చేయాలనుకున్న విషయాన్ని రూమీ జాఫ్రే చెప్పినట్టు తెలుస్తోంది. 
 
జూన్ 14న బలవన్మరణం చెందిన సుశాంత్ కొందరి వేధింపుల వల్లనే ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నాడని పలువురు వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదుగురితో కూడిన బృందం దాదాపు 35 మందికి పైగా వ్యక్తులని విచారించింది. వీరిలో జాఫ్రే కూడా ఒకరు. ఈ విచారణ తో పాటు సుశాంత్ మరణంతో బాగా అప్ సెట్ అయిన జాఫ్రే.. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేయాలనుకుంటున్నట్లు సమాచారం.