గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 జులై 2020 (17:52 IST)

నా పేరు రియా చక్రవర్తి.. సుశాంత్ ప్రియురాలిని.. సీబీఐ దర్యాప్తు చేయించండి... ప్లీజ్

బాలీవుడ్ యువ నటుడు, "ఎంఎస్ ధోనీ" బయోపిక్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఆత్మహత్యపై యావత్ సినీ ప్రపంచం స్పందించింది. మూవీ ఇండస్ట్రీలో ఉన్న బంధుప్రీతి కారణంగానే సుశాంత్ బలవన్మరణానికి పాల్పడ్డారనే విమర్శలు వచ్చాయి. ఏది ఏమైనా సుశాంత్ మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే అనేక బాలీవుడ్ సెలబ్రిటీల వద్ద విచారణ జరిపారు. 
 
ఈ క్రమంలో సుశాంత్ ప్రియురాలు, బాలీవుట్ రియా చక్రవర్తి తాజాగా ఓ డిమాండ్ చేసింది. సుశాంత్ మరణానికి గల కారణాలు తెలియాని, అందువల్ల సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. ముఖ్యంగా సుశాంత్ ఆత్మహత్య కేసులో రియా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.
 
'గౌరవనీయ అమిత్ షా గారూ... నా పేరు రియా చక్రవర్తి, నేను సుశాంత్ సింగ్ రాజ్‌‌పుత్ ప్రియురాలిని. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హఠాన్మరణం చెంది నెల గడచిపోయింది. నాకు ప్రభుత్వంపై సంపూర్ణ నమ్మకం ఉంది. అయితే న్యాయం కోసం ఈ వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలని సవినయంగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. అమిత్ షా సర్... నేను కోరుకునేది ఒక్కటే... సుశాంత్ ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి ఒత్తిళ్లు కారణమయ్యాయో తెలుసుకోవాలనుకుంటున్నాను. సత్యమేవ జయతే' అంటూ ట్వీట్ చేశారు.