తితిదేపై సీఎం జగన్‌కి ట్వీట్ చేసిన రమణదీక్షితులు, అర్చకులకు కరోనా వచ్చినా..

Ramanadeekshitulu
శ్రీ| Last Modified గురువారం, 16 జులై 2020 (14:15 IST)
టిటిడిపై సీఎం జగన్‌కి గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ట్వీట్ చేశారు. టిటిడిలో 50 మందికి గాను 15 మంది అర్చకులకు కరోనావైరస్ పాజిటివ్ వచ్చింది. మరో 25 మంది రిజల్ట్స్ రావలసి వుందన్నారు.


అయినా శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేతపై టిటిడి నిర్ణయం తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.చంద్రబాబు అనుసరించిన మీరాశి అర్చకులు, బ్రాహ్మణ వ్యతిరేక విధానాలను టిటిడి ఇప్పుడు కూడా అనుసరిస్తూందనీ,

వెంటనే సిఎం జగన్ స్పందించకపోతే టిటిడిలో ఉపద్రవం వచ్చే అవకాశం వుందని పేర్కొన్నారు. మరి దీనిపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?
దీనిపై మరింత చదవండి :