సుశాంత్ మరణంపై కంగనా.. నిరూపించుకోలేకపోతే.. పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తా!
వివాదాస్పద వ్యాఖ్యలు, ఎవరినైనా బోల్డ్‌గా ఎదుర్కొనే సత్తా వున్న స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్.. తాజాగా దేశ అత్యున్నత పద్మ శ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తానంటోంది. అలాగే బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బంధుప్రీతి కారణంగా మృతి చెందినట్లు ఇప్పటికే బాలీవుడ్‌లో వార్తలు వచ్చాయి.
ఇలాగే కంగనా కూడా సుశాంత్ మరణానికి నెపోటిజం కారణమని వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి వున్నానని చెప్పింది. కానీ తాను చేసిన విమర్శలని నిరూపించలేని పక్షంలో పద్మశ్రీ అవార్డుని తిరిగి వెనక్కి ఇచ్చేస్తానని కంగనా చెప్పుకొచ్చింది.
తన ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు కంగనా కొద్ది రోజుల క్రితం మనాలీ వెళ్లిన సంగతి తెలిసిందే. పిక్నిక్ ఫోటోలని తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. అయితే సుశాంత్ కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసులు కంగనాకి ఫోన్ చేశారని, తన స్టేట్‌మెంట్‌ని రికార్డ్ చేసుకోవడానికి ఎవరినైన పంపించమని చెప్పిన పంపలేదని కంగనా చెప్పుకొచ్చింది.
తాను పారిపోయే వ్యక్తిని కాదని చెప్పింది. ఏదైనా డైరెక్ట్‌గా మాట్లాడుతాను. తాను చేసిన విమర్శలని నిరూపించుకోలేని పక్షంలో పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తానంటూ ఓ ఛానల్‌తో చెప్పుకొచ్చింది.