గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 జులై 2020 (18:18 IST)

జూలై 1 నుంచి ఆధార్ కీలకం... పాస్‌పోర్ట్‌కు ఆధార్ నెంబర్ కంపల్సరీ

2020 ఏడాదిలో జూలై 1 నుంచి కీలకంగా మారనుంది. జూలై నుంచి ఆధార్ ప్రాధాన్యం మరింత పెరిగింది. ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు కూడా తీసుకోకపోవడం కుదరకపోవచ్చు. ఆదాయపు పన్ను, ఆధార్‌కు సంబంధించిన రూల్స్‌లో కూడా మార్పు వచ్చింది. 
 
ఇకపై ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలంటే కచ్చితంగా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిందే. అంటే మీరు ఆధార్ నెంబర్ కలిగి లేకపోతే ఇకపై ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ వ్యవహారాల శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. 
 
పాస్‌‌పోర్ట్ తీసుకోవడానికి ఆధార్ నెంబర్ కచ్చితంగా ఉండాలని తెలియజేసింది. అంటే జూలై 1 తర్వాత మీరు పాస్‌పోర్ట్ తీసుకోవాలని యోచిస్తే.. తప్పనిసరిగా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) కూడా పీఎఫ్ అకౌంట్‌తో ఆధార్ కచ్చితంగా లింక్ చేసుకోవాలని ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది. 
 
అలాగే పెన్షన్ తీసుకుంటున్న వారు కూడా ఆధార్ నెంబర్ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఆధార్ లింక్ చేసుకోవడం వల్ల పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు సులభంగానే విత్‌డ్రా చేసుకోవచ్చు.