గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: బుధవారం, 29 ఆగస్టు 2018 (15:59 IST)

నంద‌మూరి హ‌రికృష్ణ మృతికి సంతాపం తెలిపిన డా.రాజ‌శేఖ‌ర్‌, జీవిత‌

న‌టుడు, తెలుగుదేశం నేత నంద‌మూరి హ‌రికృష్ణ కారు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. ఆయ‌న మ‌ర‌ణం నంద‌మూరి అభిమానుల‌ను, టీడీపీ శ్రేణుల‌కు తీర‌ని లోటనీ, ఆయ‌న మృతికి డా.రాజ‌శేఖ‌ర్‌, జీవిత త‌మ సంతాపాన్ని తెలిపారు. వారు మాట్లాడుతూ ``హ‌రికృష్ణ‌గారు మా కుటుంబంలోని వ్య‌క్

న‌టుడు, తెలుగుదేశం నేత నంద‌మూరి హ‌రికృష్ణ కారు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. ఆయ‌న మ‌ర‌ణం నంద‌మూరి అభిమానుల‌ను, టీడీపీ శ్రేణుల‌కు తీర‌ని లోటనీ, ఆయ‌న మృతికి డా.రాజ‌శేఖ‌ర్‌, జీవిత త‌మ సంతాపాన్ని తెలిపారు. వారు మాట్లాడుతూ ``హ‌రికృష్ణ‌గారు మా కుటుంబంలోని వ్య‌క్తి. మా ఇంట్లో జ‌రిగే కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న హాజ‌రై ప్ర‌త్యేక అభిమానంతో ప‌ల‌క‌రించేవారు.
 
ఎంతో మ‌నోబ‌లాన్ని అందించేవారు. అటువంటి వ్య‌క్తి నేడు మ‌నమ‌ధ్య లేరంటే జీర్ణించుకోవ‌డం క‌ష్టంగా ఉంది. చాలా బాధగా ఉంది. న‌మ్మ‌శ‌క్యం కావ‌డం లేదు. ఆయ‌న్ను మిస్ అవుతున్నాం. 
 
ఎన్టీఆర్‌, క‌ల్యాణ్‌రామ్ స‌హా ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ఆ భ‌గ‌వంతుడు ధైర్యాన్ని ప్ర‌సాదించాలి. హ‌రికృష్ణ‌గారి ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలని కోరుకుంటున్నాం`` అన్నారు.